ఆప్ ఓటమిలో కవిత పాత్రుందా ?

మూడోసారి 2020లో ముఖ్యమంత్రి కాగానే అరవింద్ పై వరుసగా అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి;

Update: 2025-02-08 10:22 GMT
Kejriwal and Kavitha

ఇపుడిదే విషయమై పెద్దఎత్తున చర్చజరుగుతోంది. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతు అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని ఢిల్లీ జనాలు భరించలేకపోయినట్లు చెప్పారు. కేజ్రీవాల్(Aravind Kejriwal) అవినీతిలో కల్వకుంట్ల కవిత(Kavitha) నాయకత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కూడా ఉందని ఎంపీ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ యావత్ దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్కామ్ లో కీలకసూత్రదారి కేజ్రీవాల్ అయితే కీలకపాత్రదారి కల్వకుంట్ల కవితగా బీజేపీ నేతలు అప్పట్లో ప్రతిరోజు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకపాత్రపై రాహుల్ గాంధీ(Rahulgandhi), రేవంత్ రెడ్డి(Revanth)తో పాటు చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిరోజు ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది.

మొదటిసారి, రెండోసారి కేజ్రీవాల్ సీఎం అయినపుడు అవినీతి ఆరోపణలు లేవనేచెప్పాలి. మూడోసారి 2020లో ముఖ్యమంత్రి కాగానే అరవింద్ పై వరుసగా అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. అందులో లిక్కర్ స్కామ్ చాలా కీలకమైనది. నిజానికి ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన డబ్బులు తక్కువే అయినా అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మాత్రం చాలా కీలకపదవుల్లో ఉన్నవారే. కేజ్రీవాల్ కాకుండా అప్పటి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, సత్యేంద్రజైన్, అప్పటి వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ నిజాయితీపై గట్టిదెబ్బ కొట్టిందనే చెప్పాలి. చాలామంది నేతల్లాగే కేజ్రీవాల్ కూడా శుద్ధపూసేమీకాదన్న విషయం జనాలకు అర్ధమైపోయింది.

ఫెయిర్ రాజకీయంతో కేజ్రీవాల్ ను ఓడించటం కష్టమని అర్ధమవటంతోనే నరేంద్రమోడి, అమిత్ షా లు ఇతరమార్గాల్లో దెబ్బకొట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను ముందుపెట్టి తనను నరేంద్రమోడి బాగా ఇబ్బందులు పెడుతున్నట్లు కేజ్రీవాల్ చాలాసార్లు మండిపడిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పైన కేసులు నమోదుచేయటంతో పాటు అరెస్టు చేయటం ఆప్ ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మనీష్, సత్యేంద్ర లాంటి అనేకమందిని సీబీఐ, ఈడీలు కేసుల్లో అరెస్టుచేసి నెలలపాటు జైళ్ళల్లో ఉంచుంది. ఎన్నికల్లో ప్రచారం కోసమని అడిగితే కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. ఇపుడు ఆప్ ఓడిపోయింది కాబట్టి బెయిల్ రద్దయి మళ్ళీ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళాల్సొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

కేజ్రీవాల్ తో పాటు పార్టీలో కీలకనేతలు లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళటంతో పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. చివరినిముషంలో ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని అతిషీని సీఎంగా చేసినా ఉపయోగంలేకపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఇమేజీకి బాగా డ్యామేజయిపోయింది. అందుకనే బీజేపీ ఎంపీ అరుణ మాట్లాడుతు కవితకు థ్యాంక్స్ చెప్పింది. స్కామ్ లో కేజ్రీవాల్ ను కవిత నిండాముంచేయటంతోనే ఆప్ ఓటమికి బాటలు పడినట్లు అరుణ ఎద్దేవాచేశారు. ఆప్ ఓటమికి ఇంకా కారణాలు చాలానే ఉన్నప్పటికీ కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించిన లిక్కర్ స్కామ్ దెబ్బమాత్రం బాగా గట్టిగా తగిలినట్లు అర్ధమవుతోంది.

Tags:    

Similar News