కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత..
1980లో జర్నలిస్ట్‌గా మొదలైన ఆయన ప్రస్థానం..
తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా పేరొందిన కొండా లక్ష్మారెడ్డి ఇకలేరు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందుకుంటూనే సోమవారం కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన ఆయన న్యూస్ అండ్ సర్వీస్ సిండికేట్(NSS) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా విశేష సేవలందించారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబీకులు అపోలో ఆసుపత్రిలోచేర్చించారు. వైద్యులు అందించిన చికిత్స ఫలించలేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొండా శరీరం వైద్యాన్ని స్వీకరించలేదు. దీంతో సోమవారం తెల్లవారుజామున
స్వర్గస్తులయ్యారు.
జర్నలిజంపైన ఉన్న మక్కువతో 1980లో స్థానిక వార్తా పత్రిక NSSను స్థాపించారు. జర్నలిస్ట్ హక్కుల కోసం ఎంతో కృషి చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కమిటీ(APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు ఏపీ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇదే విధంగా మరిన్ని పదవుల్లో కూడా ఆయన సేవలందించారు.
సీఎం రేవంత్ సంతాపం..
కొండా లక్ష్మారెడ్డి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన అందించిన సేవలను అద్భుతమన్నారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యలకు ఆయన తన సానుభూతి తెలిపారు.