KCR future|కేసీఆర్ భవిష్యత్తును బీజేపీ ఎంపీ తేల్చేశారా ?
కేసీఆర్ కు కూడా ఇదేగతి పడుతుందని ధర్మపురి జోస్యం చెప్పారు.;
కేసీఆర్ భవిష్యత్తుపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యంచెప్పారు. అదికూడా ఫార్ములా ఈ కార్ రేసు అవినీతికి సంబంధించి కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు ఏకమైనట్లే అనిపిస్తోంది. మంత్రిగా ఉన్నపుడు కేటీఆర్(KTR) అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ రాతమూలకంగా ఇచ్చిన వాగ్మూలమే దీనికి ఆధారం. జరిగిన అవినీతిని అర్వింద్ పూసగుచ్చినట్లుగా వివరించారు కాబట్టే కేటీఆర్ మీద ఏసీబీ(ACB Case) కేసునమోదు చేసి విచారణకు రెడీ అయ్యింది. అవినీతిలోతుల్లోకి వెళ్ళి ఎలాగైనా కేటీఆర్ ను కోర్టులో నిలబెట్టాలన్నది రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం పట్టుదల. అందుకు సాక్ష్యాధారాల కోసం ఏమేమిచేయాలో ప్రభుత్వం అంతాచేస్తోంది.
ఇదేసమయంలో కేటీఆర్ ను జైలుకు పంపాల్సిందే అని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఫార్ములా కార్ రేసు(Formula E Car Race) అవినీతిలో అడ్డంగా దొరికిన కేటీఆర్ ను ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Arvind) ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. అవినీతికి పాల్పడ్డారని తేలిన వాళ్ళని శిక్షించాలంటే అందుకు ప్రొసీజర్ ఉందన్నవిషయాన్ని ఎంపీ మరచిపోయినట్లున్నారు. ముందు కేసునమోదు చేయటానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. తర్వాత కేసుపెట్టి విచారణ జరపాలి. తర్వాత అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టువిచారణలో కేటీఆర్ అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి. అప్పుడు కేటీఆర్ కు ఏమిశిక్ష వేయాలో కోర్టు తేలుస్తుంది. చాలాకేసులు కోర్టులో వీగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే.
అవినీతి జరిగిందని అందరికీ తెలిసినా సాక్ష్యాలతో కోర్టులో నిరూపించటం అంత సులభంకాదు. సాక్ష్యాలతో కోర్టులో నిరూపించలేకపోతే కేటీఆర్ నిర్దోషిగా బయటకు వచ్చేస్తారనటంలో సందేహంలేదు. అయితే ఈ విషయాలను ఎంపీ పట్టించుకోవటంలేదు. కేటీఆర్ ను ఉద్దేశించి ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతకాలం తప్పించుకుని తిరుగుతావ్’ అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ ముందు రెండే ఆప్షన్లున్నట్లు ఎంపీ చెప్పారు. అవేమిటంటే ‘ఈడీ కేసులో తీహార్ జైలుకు(Tihar Jail) వెళ్ళటమా? లేకపోతే ఏసీబీ కేసులో చంచల్ గూడ జైలులో కూర్చోవటమా’ ? అని వివరించారు. కేటీఆర్ కు మూడో ఆప్షన్ లేదన్నారు. పనిలోపనిగా కేసీఆర్ గురించి కూడా ధర్మపురి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే కేసీఆర్ కు కూడా ఇదేగతి పడుతుందని ధర్మపురి జోస్యం చెప్పారు. ‘కేటీఆర్ వెళ్ళిన జైలుకే కేసీఆర్(KCR) కూడా వెళ్ళకతప్పద’ని ధర్మపురి ఫైనల్ చేసేశారు.
‘జైలుకు వెళ్ళిస్తే జనాల్లో సానుభూతి రావటానికి కేటీఆర్ ఏమన్నా సరిహద్దుల్లో యుద్ధంచేశారా’ ? అని ధర్మపురి ఎద్దేవాచేశారు. తెలంగాణాను పదేళ్ళపాటు కేసీఆర్ కుటుంబం దోచుకుని తిన్నదని ఆరోపించారు. విచారణ అధికారుల ముందు కేటీఆర్, కవిత(Kavitha) డిమాండ్లు పెట్టడమే విచిత్రమన్నారు. కొడుకు, కూతురు కారణంగా కేసీఆర్ ఎంతో నష్టపోయారని ఎంపీ చెప్పారు. వాళ్ళిద్దరినీ అదుపులో పెట్టకపోత సర్వం కోల్పోకతప్పదని కూడా ధర్మపురి జోస్యంచెప్పారు.