క్షణాల పాటు కంపించిన తెలంగాణ..

భూక్రంపనలు తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదయింది.;

Update: 2025-05-05 15:39 GMT

తెలంగాణలో సోమవారం రాత్రి 7-8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్‌లో భూమి రెండు నుంచి మూడు సెకన్ల పాటు కంపించింది. మరోవైపు నిర్మల్ జిల్లాలో ఐదు సెకన్ల వరకు భూమి కంపించింది. ఈ భూక్రంపనలు తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగలేదని ప్రాథమిక సమాచారం.

Tags:    

Similar News