సినిమా స్టార్ల పై బెట్టింగ్ యాప్ కేసులు
డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించారని, మనీల్యాండరింగు(Money Laundering)కు పాల్పడ్డారని సినిమా స్లార్ట మీద ఈడీ కేసులు;
బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదుచేసింది. బెట్టింగ్ యాప్స్ (Betting Apps)నుండి రెమ్యునరేషన్ రూపంలో తీసుకున్న డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించారని, మనీల్యాండరింగు(Money Laundering)కు పాల్పడ్డారని సెలబ్రీటీలపై ఈడీ కేసులు నమోదుచేసింది. ప్రకాష్ రాజ్(Prakash Raj), రానా, మంచులక్ష్మి(Manchu Lakshmi), అనన్య నాగళ్ళ తో పాటు బుల్లితెర సెలబ్రిటీలు శ్రీముఖి(Srimukhi) తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వీళ్ళందరినీ సీఐడీ రెండు సార్లు విచారించింది. బెట్టింగ్ యాప్ లతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తాము కేవలం డబ్బుల కోసమే యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు గతంలోనే సెలబ్రిటీలు విచారణలో వాగ్మూలమిచ్చారు.
అయితే ఇంతకాలం తర్వాత సడెన్ గా ఈడీ(ED) రంగంలోకి దూకింది. సెలబ్రిటీలందరిపైనా మనీల్యాండరింగ్ కేసులు నమోదుచేయటమే కేసులో కీలకంగా మారింది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయటం యువతను తప్పుదోవపట్టించినట్లే అని దర్యాప్తుసంస్ధలు పదేపదే వాదిస్తున్నాయి. అయితే బెట్టింగ్ తో తమకు ఎలాంటి సంబంధంలేదని తెలీక తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా ఉన్నామని ఇప్పటికే వీళ్ళంతా విచారణలో చెప్పారు. కాకపోతే ఇపుడు ఈడీ నమోదుచేసిన కేసులో కొత్తకోణం ఏమిటంటే మనీల్యాండరింగ్. తొందరలోనే ఇదే కోణంలో విచారించేందుకు నోటీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం. డబ్బులు తీసుకుని ప్రమోటార్లుగా నటించామని చెప్పటం వరకు ఓకేనే మరి మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏమి సమాధానాలు చెబుతారో చూడాలి. సెలబ్రిటీలు మనీల్యాండరింగుకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేకుండానే ఈడీ నోటీసులు ఇచ్చుంటుందా ? విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.