హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..
ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటిలో ఎలాగైనా గెలిచి తమ పట్టు చూపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి.;
By : The Federal
Update: 2025-03-24 06:42 GMT
హైదరాబాద్‌లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటిలో ఎలాగైనా గెలిచి తమ పట్టు చూపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. పార్టీలు ఈ పార్టీల్లో ఎలాగైనా విజయం సాధించాలని, రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..
28 మార్చ్‌న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 4న నామినేషన్ దాఖలుకు చిరవరి రోజు. ఏప్రిల్ 7న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న కౌంటింగ్ ప్రక్రియ చేయనున్నారు.