రెండో రోజు ఎసిబి కస్టడీలో ఈఎన్సీ చీఫ్ మురళీధర్ రావు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కూపీ;

Update: 2025-07-24 08:05 GMT

కస్టడీలో భాగంగా మాజీ ఈఎన్సిచీఫ్ మురళీ ధర్ రావును రెండో రోజు ఎసిబి అధికారులు ప్రశ్నించనున్నారు. మొదటి రోజు ఆయన పర్సనల్ విషయాలు, నీటి పారుదలా శాఖలో చేరినప్పటి నుంచి ఈఎన్సిగా పదోన్నతి పొందేవరకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదాల సందర్బంగా సీజ్ చేసిన డాక్యుమెంట్లు , ఇతర ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ చీఫ్ మురళీధర్ రావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఏసీబీ విన్నపం మేరకు బుధవారం నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదురోజుల కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతించింది. దీంతో నాంపల్లిలోని సిటీ రేంజ్ కార్యాలయానికి మాజీ ఈఎన్సీని తరలించారు.

Tags:    

Similar News