మహిళలకు మత్తుమందిస్తున్న నకిలీ బాబా అరెస్టు
తన దగ్గరకు వచ్చే మహిళలకు మత్తుమందిచ్చి అత్యాచారాలు చేస్తున్నాడు;
మనదేశంలో మూఢభక్తి ఉన్నంతకాలం ఫేక్ బాబాలు ఫుల్లు హ్యాపీ అనటంలో ఎలాంటి సందేహంలేదు. జనాల మూఢభక్తే ఫేక్ బాబాల పెట్టుబడిగా ఇప్పటికే చాలా ఘటనలు రుజువైనా ఇంకా అమయాక జనాలు ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ఇపుడిదంతా ఎందుకంటే మెదక్ జిల్లాలో పోలీసులు బాపూస్వామి అనే దొంగబాబాను అరెస్టుచేశారు. అనారోగ్యాలను నయంచేస్తానని బాగా ప్రచారంచేసుకున్న బాబా(Fake Baba) తన దగ్గరకు వచ్చే మహిళలకు మత్తుమందిచ్చి అత్యాచారాలు చేస్తున్నాడు. ప్రత్యేక పూజలు చేయటం ద్వారా అనారోగ్యాన్ని నయంచేస్తానని బాబా చేసుకున్న ప్రచారాన్ని చాలామంది మహిళలు నమ్మటమే విచిత్రం. తనదగ్గరకు పూజలు చేయించుకునేందుకు మహిళలు వచ్చేవారు.
ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పుకున్న ఫేక్ బాబా పూజల సమయంలో ధూపం వేసేవాడు, అలాగే పూజల తర్వాత తీర్ధ, ప్రసాదాలు ఇచ్చేవాడు. పూజలు చేసేసమయంలో ఒక్క మహిళమాత్రమే ఉండాలనే నిబంధన పెట్టేవాడు. పూజ సమయంలో వేసే ధూపంలోనో లేకపోతే తర్వాత అందించే తీర్ధ, ప్రసాదాల్లోను ధొంగబాబా ఏదో మత్తుమందు కలిపేవాడు. ధూపం దెబ్బకో లేకపోతే తీర్ధ, ప్రసాదాలు తీసుకున్న వెంటనే మహిళలు స్పృహకోల్పోయేవారు. దాంతో దొంగబాబా స్పృహలోలేని మహిళలపై అత్యాచారాని(Rape on women)కి పాల్పడేవాడు. మెలకువ వచ్చిన తర్వాత తమకు ఏమి జరిగిందో గ్రహించిన కొందరు మహిళలు ఫేక్ బాబును నిలదీసినా ఏమీచేయలేని స్ధితిలో ఉండిపోయారు.
ఎందుకంటే మత్తుమందిచ్చి మహిళలపై అత్యాచారం చేసిన ఫేక్ బాబు అత్యాచారాన్ని వీడియోలు కూడా తీయించాడు. తనను నిలదీసిన కొందరు మహిళలకు దొంగబాబా సదరు వీడియోలను చూపించి(Black Mailing) నోళ్ళు మూయిస్తున్నాడు. తనబండారం బయటపడిందని తెలుసుకన్న తర్వాతయినా ఫేక్ బాబా తన పద్దతిని మార్చుకున్నాడా అంటే లేదు. యథావిధిగా మత్తుమందు, అత్యాచారం, వీడియోలు, బెదిరింపులను మూడు పువ్వులు ఆరు కాయలుగా కంటిన్యు చేస్తునే ఉన్నాడు. అయితే కాలం ఎల్లకాలం ఒకలాగుండదన్న విషయాన్ని ఈ దొంగబాబా మరచిపోయాడు. ఒక మహిళ ధైర్యంచేసి ఫేక్ బాబాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది. దాంతో దొంగబాబా గురించి కూపీలాగిన పోలీసులు తగిన ఆధారాలు దొరకగానే దాడిచేసి అరెస్టు చేశారు.
దొంగ బాబా నేపధ్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపూస్వామి చాలాకాలంగా బాబాగా చెలామణి అవుతున్నాడు. అనారోగ్యంతో ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తానని చాలామందిని నమ్మించాడు. పూజల పేరుతో వందలాది మహిళలతో సన్నిహితమయ్యాడు. ఒక మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదుచేయటంతో ఫేక్ బాబా వ్యవహారం బట్టబయలైంది. బాబాను అరెస్టుచేసి ఇంటిని వెతికిన పోలీసులకు పెద్ద ఫాక్ తగిలింది. కారణం ఏమిటంటే బాబా దగ్గర వందలాది బూతు వీడియోలు దొరికాయి. అంటే ఫేక్ బాబా ఎంతమంది మహిళలకు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడో అని పోలీసులు నోరెళ్ళబెట్టారు. నిందితుడి దగ్గర నుండి తాయత్తులు, మత్తుమందులు, రెండు మొబైల్ ఫోన్లు, సీడీలు, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతు దొంగబాబాలను ఎవరు నమ్మవద్దని చెప్పారు.