నకిలీ సర్టిఫికేట్ ముఠా గుట్టు రట్టు

కూకట్ పల్లి పోలీసుల అదుపులో నిందితులు;

Update: 2025-07-26 12:52 GMT

నకిలీ సర్టిఫికేట్ ముఠాను శంషాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కెపిహెచ్ బి కాలనీలో వ్యాసకన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తుంది ఈ ముఠా. శంషాబాద్ పోలీసులు ఈ ముఠా పై నిఘా పెట్టారు. బికాం, బీ టెక్ సర్టిఫికేట్లు తయారు చేసే ఆకాసపు హరీష్, మావూరి మహేష్ లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి వీరికి సహాయం చేయడంతో ఈ ఇద్దరు నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు. సహకరించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు. ఒక డెస్క్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు తరలించేవారని పోలీసులు తెలిపారు. 46 మందికి వీరు నకిలీ సర్టిఫికేట్లు అమ్మినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నకిలీ సర్టిఫికేట్లతో 24 మంది విదేశాలకు ప్రయాణమయ్యారని పోలీసులు తెలిపారు. ముఠా గుట్టురట్టు చేసిన శంషాబాద్ పోలీసులు నిందితులను కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. కూకట్ పల్లి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News