Folk singer Suicide|ఫోక్ సింగర్ ఆత్మహత్య
ఇద్దరి మధ్యా ఏమైందో తెలీదు కాని బుధవారం మధ్యాహ్నం దయాకర్ ఇంటికి వచ్చినపుడు ఎవరూ లేని సమయంలో చూరుకు ఉరేసుకుని కనిపించింది.;
ఇన్ స్టాగ్రామ్ ద్వారా పాపులరైన ఫోక్ సాంగ్స్ సింగర్ శృతి ఆత్మహత్య చేసుకున్నది. సింగర్ ఆత్మహత్య వార్త వినగానే ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. సిద్ధిపేట(Siddhipet) జిల్లా మహదేవ్ పూర్ మండలం పీర్లపల్లికి చెందిన శృతి(Folk singer Sruthi)కి మొదటినుండి పాటలు పాడటంపైన చాలా ఆశక్తి. అందులోను పల్లె పదాలు, జానపదాలు(Folksongs Singer) పాడటం అంటే చాలా ఇష్టం. తన ఇష్టానికి తగ్గట్లే చిన్నప్పటినుండి జానపదాలు పాడటంపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. జానపదాలు పాడటంలో బాగా సాధనచేసింది. దాంతో పాటలు పాడటంపై పట్టుసాధించింది. తెలంగాణా వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా శృతి హాజరై పాటలు పాడేది. రెగ్యులర్ గా ప్రోగ్రాములు ఇస్తుండటంతో పాటు ఇన్ స్టాగ్రామ్(Instagram) లో కూడా బాగా యాక్టివ్ గా ఉండేది. తన పాటలను ఇన్ స్టాగ్రామ్ లో కూడా అప్ లోడ్ చేస్తుండటంతో తొందరలోనే బాగా పాపులరైంది.
ఇదే ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన క్యాబ్ డ్రైవర్ దయాకర్ తో స్నేహం పెరగటంతో అతనిని ప్రేమవివాహం కూడా చేసుకున్నది. జానపదాలతో పాటు ప్యారడీ సాంగ్స్ తో శృతి బాగా పాపులర్ అవటాన్ని దయాకర్ తట్టుకోలేకపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇద్దరి మధ్యా ఏమైందో తెలీదు కాని బుధవారం మధ్యాహ్నం దయాకర్ ఇంటికి వచ్చినపుడు ఎవరూ లేని సమయంలో చూరుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని స్ధానికులతో పాటు శృతి తల్లి, దండ్రులకు తెలిపాడు. విషయం తెలిసి పోలీసులు ఇంటికి చేరుకుని పోస్టుమార్టమ్ కోసం గజ్వేలు(Gajwel) ఆసుపత్రికి తరలించారు.
నాలుగు నెలల గర్భిణి
శృతి నాలుగు నెలల గర్భిణి అని ఇంట్లోవాళ్ళు చెప్పారు. కుటుంబ కలహాల వల్లే సింగర్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. కట్నం డబ్బుల కోసమే అత్తింటి వాళ్ళు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు శృతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి దగ్గర రెండువైపుల జనాల మధ్య పెద్ద వాగ్వాదం జరగ్గా పోలీసులు జోక్యం చేసుకుని అందరినీ అక్కడి నుండి దూరంగా పంపేశారు. మరి పోస్టుమార్టమ్ లో ఏమి తేలుతుందో చూడాలి.