భద్రాద్రిరాముడికి విదేశీ కరెన్సీ
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి హుండీలో విదేశీకరెన్సీ(Foreign Currency) కూడా కనిపించింది;
భద్రాచల సీతారామచంద్రస్వామికి విదేశీ కరెన్సీ పెరుగుతోంది. సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు ప్రతిరోజు వస్తుండటం అందరికీ తెలిసిందే. భద్రాచలంకు దక్షిణ అయోధ్యగ పేరుంది. ఇలాంటి దక్షిణ అయోధ్య(Ayodhya)కు ఎన్ఆర్ఐలు కూడా చాలామందే వస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ భద్రాచలం(Bhadrachalam Temple) ఆలయ హుండీలో విదేశీకరెన్సీ ప్రత్యక్షంకావటమే. మామూలుగా దేవాలయంలో హుండీ ఆదాయాన్ని 30 లేదా 40 రోజులకు ఒకసారి లెక్కపెడతారు. గతంలో లెక్కపెట్టినపుడు హుండీ ఆదాయం సుమారు రు. 1 కోటి మించలేదు. అలాంటిది తాజాగా లెక్కపెట్టినపుడు హుందా ఆదాయం రు. 2 కోట్లు వచ్చినట్లు సమాచారం.
2024, మే నెలలో 2,48,214 మంది భద్రాద్రి రాముడిని దర్శించుకోగా 2025, మేనెలలో 2,88, 103 మంది దర్శించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే పోయిన ఏడాది మేనెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మే నెలలో సుమారు 40 వేలమంది భక్తులు పెరిగారు. అలాగే 2024, జూన్ లో భక్తులు 2,03, 210 మంది స్వామివారిని దర్శించుకోగా మొన్నటి మేనెలలో 2,43,512 మంది దర్శించుకున్నారు. ఈ నెలలో కూడా 40 వేలమంది భక్తులు పెరిగినట్లు తెలుస్తోంది. దర్శనంచేసుకున్న భక్తుల సంఖ్య 40 వేలు పెరిగినా ఆదాయం మాత్రం దాదాపు నూరుశాతం పెరగటం గమనార్హం.
గతంలో హుండీ ఆదాయం ఎప్పుడు లెక్కపెట్టినా కోటి రూపాయలు వచ్చేది. మరి తాజాగా లెక్కబెట్టిన హుండీలో ఆదాయం సుమారు 2 కోట్ల రూపాయలు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే హుండీ ఆదాయం నూరుశాతం పెరుగుదల నమోదైనట్లు అర్ధమవుతోంది. ఈసారి గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి హుండీలో విదేశీకరెన్సీ(Foreign Currency) కూడా కనిపించింది. హుండీ ఆదాయం రు. 2 కోట్లలో (US Dollars)అమెరికా డాలర్లు 1689, థాయ్ ల్యాండ్ బాట్స్ 580, సింగపూర్ డాలర్లు 50, మలేషియా రింగెట్స్ 20, నేపాల్ రుపీస్ 10, ఐర్లాండ్ పౌండ్స్ 15, బ్రిటన్ పౌండ్లు 15, వియత్నాం డాంగ్స్ 5 వేలు హుండీలో కనిపించాయి.
ఇదే విషయాన్ని భద్రాచలం దేవాలయ అధికారులను అడిగినపుడు శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు. విదేశీకరెన్సీ పెద్దఎత్తున హుండీలో వచ్చినమాట వాస్తవమే అన్నారు. పై దేశాల్లోని ఎన్ఆర్ఐలు సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చినపుడు హుండీలో వేశారని చెప్పారు. భద్రాద్రి రాముడి దర్శనానికి తెలుగు భక్తుల తర్వాత ఎక్కువగా తమిళనాడు నుండే వస్తుంటారని, అలాగే పొరుగునే ఉన్న కారణంగా ఛత్తీస్ ఘడ్ నుండి కూడా భక్తులు వస్తుంటారని చెప్పారు.