కెసీఆర్ కు వైద్య పరీక్షలు
యశోదా ఆస్పత్రికి కుటుంబ సభ్యులతో...;
మాజీముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య శోభ, మాజీ మంత్రులు కెటీఆర్, హరీష్ రావ్, రాజ్య సభ సభ్యులు సంతోష్ ఉన్నారు.
కెసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి నేరుగా హైద్రాబాద్ నందినగర్ చేరుకున్నారు. అక్కడ్నుంచి యశోదా హాస్పిటల్ చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
కెసీఆర్ తరచుగా వైద్య పరీక్షలు జరుపుకోవడం చర్చనీయాంశమైంది. గులాబీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కొన్ని రోజుల క్రితం కెసీఆర్ ఎఐజి ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్నారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన తర్వాత కెసీఆర్ బాత్రూంలో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పుడు ఇదే ఆస్పత్రిలోచికిత్స తీసుకున్నారు. తాజాగా బిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలికిగాయంతో ఇదే ఆస్పత్రిలోచేరారు. కెసీఆర్ ఆయనను పరామర్శించాలనుకున్నారు. కానీ కుదరలేదు.కెసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం అని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయని ప్రచారంలో ఉంది.