అక్షయ తృతీయ ముందే బంగారం కొంటున్నారా.. గుడ్ న్యూస్

అక్షయ తృతీయ కంటే ముందే బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గురువారానికి (ఈరోజుకి) పుత్తడి ధరలు దిగొచ్చాయి.

Update: 2024-05-09 06:26 GMT
Photo Credits : Instagram

అక్షయ తృతీయ కంటే ముందే బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అక్షయ తృతీయ ముందు బంగారం కొనాలి అనుకునే వారిని బుధవారం (నిన్న) పెరిగిన పసిడి ధర నిరాశ పరిచింది. కానీ గురువారానికి (ఈరోజుకి) పుత్తడి ధరలు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైసెస్ పతనం అవడంతో దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు కొంత తగ్గాయి. గురువారం దేశ రాజధాని డిల్లీలో బంగారం ధర రూ.150 మేర తగ్గింది.

బంగారం ధరలు ఈరోజు..

ఢిల్లీలో ఈరోజు ఉదయం 6:10 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,410గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,390కి చేరుకుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,360గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240కి చేరుకుంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,360, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240 ఉంది. 

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...

వెండి ధరలు కిలో రూ.200 మేర తగ్గి రూ.84,900 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,900, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.88,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.88,400 కి చేరుకుంది. 

Tags:    

Similar News