శ్రీకాకుళం ‘సాహసి’ కి రాజ్ భవన్ సత్కారం

సాహస క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపించి వరల్డ్ రికార్డు సాధించిన శ్రీకాకుళం మహిళా ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి త్వరలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనున్నారు.;

Update: 2025-07-27 06:29 GMT
ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి అవార్డు అందుకుంటున్న ఆర్మీమేజర్ కవిత వాసుపల్లి

శ్రీకాకుళం జిల్లా మెట్టూరు కుగ్రామంలో పుట్టి, శ్రీకాకుళంలో ఎంబీబీఎస్ చదివి, ఇండియన్ ఆర్మీలో డాక్టరుగా చేరి మేజర్ స్థాయికి ఎదిగి, సాహస క్రీడల్లో పాల్గొని ప్రపంచ రికార్డు సాధించిన కవిత వాసుపల్లిని (Maj Kavitha Vasupalli) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు.(Governor Abdul Nazeer congratulates) బ్రహ్మపుత్ర నదిలో 28 రోజుల పాటు 1,040 కిలోమీటర్ల దూరం రాఫ్టింగ్ యాత్ర పూర్తి చేసిన కవిత తన తల్లిదండ్రులు వాసుపల్లి రామారావు, రమ్యలతో కలిసి గవర్నరును కలిశారు. ఆర్మీలో మేజరుగా పనిచేస్తూ సాహస క్రీడల్లో అసాధారణ ఘనత సాధించిన కవితను గవర్నర్ ఆశీర్వదించారు. ఆర్మీలో పనిచేస్తూ సొంత రాస్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ కు పేరు తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు.




 ప్రమాదం నుంచి బయటపడ్డాను...

‘‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. మా బృందం నదిలో రాఫ్టింగ్ చేస్తుండగా పెద్ద అల తెప్పకు ఢీకొనడంతో పల్టీలు కొట్టింది. సెకన్లలోనే మేం నది నీటి అడుగులోకి పడిపోయాం. కాని మేం భయపడకుండా సజీవంగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం. జీవితానికి మరణానికి మధ్య సన్నని రేఖ ఉందని మాకు తెలిసింది.అరుణాచల్ ప్రదేశ్ లోని గెల్లింగ్ నుంచి బ్రహ్మపుత్ర నదిలో అసోంలోని హాట్సింగిమరి వరకు 28 రోజులపాటు 1,040 కిలోమీటర్ల దూరం రాఫ్టింగ్ సాహస యాత్ర గురించి గవర్నరుకు చెప్పగా ఆసక్తిగా విని, ఆయన ప్రశంసించారు’’అని కవిత వాసుపల్లి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే చాలు విజయాలు సాధించవచ్చని కవిత నిరూపించారు. ఈ సాహస యాత్రకు లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లభించింది. రాష్ట్రపతి నుంచి విశిష్ఠ సేవా మెడల్ కు కవిత ఎంపికయ్యారు.



 ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనేదే నా లక్ష్యం

భవిష్యత్ లో భారత సైన్యంలో మేజరుగా పనిచేస్తూనే ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everestఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి అవార్డు అందుకుంటున్న ఆర్మీమేజర్ కవిత వాసుపల్లి) అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కవిత వాసుపల్లి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.(Srikakulam female army star) గవర్నరును కలిసి వచ్చిన కవిత మాట్లాడుతూ తన భవిష్యత్ లక్ష్యాల గురించి వివరించారు. తాను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం కోసం శిక్షణ పొందుతానని ఆమె పేర్కొన్నారు. మరో వైపు తాను స్పోర్ట్సు మెడిసిన్ లేదా అఫ్తమాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆర్మీ మేజర్ కవిత వివరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళగా తాను సాహస క్రీడల్లో ఎన్నెన్నో విజయాలు సాధించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలవాలనేదే తన లక్ష్యం అంటూ కవిత పేర్కొన్నారు.


Tags:    

Similar News