కొమురంభీం జిల్లా వాంకిడిలో విషాదం

నీటి గుంటలో పడి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మృతి;

Update: 2025-09-13 12:08 GMT

నీటి మడుగులో పడి ఒక మహిళ ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన కుమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలం డాబా గ్రామంలో శనివారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లారు. నీటి కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంటలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు మునిగిపోతుండగా చూసిన తల్లి నీలాబాయి రక్షించడానికి నీటిగుంటలో దిగింది. తొమ్మిదేళ్ల లోపు వయసున్న ముగ్గురు పిల్లలు, తల్లి నీటి గుంట నుంచి బయటకు రాలేక మునిగిపోయారు. సమాచారమందడంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ముగ్గురు పిల్లలు, తల్లి నీలాబాయి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన పిల్లల్లో ఇద్దరు బాలికలున్నారు. ఒకేసారి నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News