నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత
భారీ వర్షాలకు పోటెత్తిన వరదనీరు;
నాగార్జునసాగర్ కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు కు జలకళ సంతరించుకోవడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు కావడంతో గరిష్ట సామర్ధ్యానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎగువన మహారాష్ట్రతో బాటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వద నీరు చేరుతోంది. సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ కు ఇన్ ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది.
ఈ ప్రాజెక్టు తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో ఉంది. ఎపి లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మించారు.