GOVERNOR'S AWARDS | 8మంది విశిష్ఠ వ్యక్తులకు గవర్నర్ పురస్కారాలు

తెలంగాణలో 2024లో విశిష్ఠ సేవలందించిన 8 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రతిభా పురస్కారాలు అందజేశారు.ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలను అంందించారు.;

Update: 2025-01-26 10:20 GMT

పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగ జన సంక్షేమం, క్రీడలు,ఆటలు, సంస్కృతి అనే నాలుగు ముఖ్యమైన రంగాల్లో వ్యక్తులు, సంస్థలు చేసిన అత్యుత్తమ కృషి,స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ -2024ను ప్రారంభించారు.

గవర్నర్ పురస్కారాల ఎంపిక కోసం గత ఏడాది నవంబరులో వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్లు ఆహ్వానించారు. రాష్ట్రంలో నాలుగు విభాగాల్లో 594 దరఖాస్తులు వచ్చాయి. గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌ను కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె. పద్మనాభయ్య నేతృత్వంలోని విశిష్ఠ అవార్డుల ఎంపిక కమిటీని నియమించారు.జ్యూరీలో పర్యావరణ కార్యకర్తఅనిల్ కుమార్; పద్మశ్రీ అవార్డు గ్రహీత. దివ్యాంగజన సంక్షేమం కోసం న్యాయవాది డాక్టర్ పి. హనుమంత రావు; పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ లెజెండ్ కోచ్ డాక్టర్ పుల్లెల గోపి చంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి నృత్య నిపుణురాలు డాక్టర్ పద్మజా రెడ్డి వంటి ప్రముఖ నిపుణులు ఉన్నారు.

గవర్నర్ అవార్డు గ్రహీతలు
పర్యావరణ పరిరక్షణ పాటుపడుతున్న దుశర్ల సత్యనారాయణ (నల్గొండ), దివ్యాంగజన సంక్షేమానికి కృషి చేసిన అరికపూడి రఘు (సంగారెడ్డి జిల్లా),క్రీడలు, ఆటల విభాగంలో జీవంజీ దీప్తి (వరంగల్),సంస్కృతిలో పి.బి.కృష్ణ భారతి (హైదరాబాద్),ప్రొ.ఎం. పాండు(వరంగల్ జిల్లా),పర్యావరణ పరిరక్షణ సంస్థ ధ్రువంశ్(రంగారెడ్డి) మధులికా చౌదరి,దివ్యాంగ జన సంక్షేమ సంస్థ ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్గనైజేషన్ ఆదిత్య మెహతా ఫౌండేషన్,సంస్కృతి ఫౌండేషన్ పక్షాన టి. రాంబాబు (హైదరాబాద్) లకు గవర్నర్ పురస్కారాలను ప్రదానం చేశారు.ప్రతి అవార్డుకు రూ.2 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు.



13 మంది సీనియర్ అధికారులకు ప్రత్యేక పురస్కారాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన తోపాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి జరిపిన 13 మంది అధికారులకు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ప్రత్యేక పురస్కారాలు అందుకున్న వారిలో విక్రం సింగ్ మాన్, ముషారఫ్ ఫారూఖీ, అనురాగ్ జయంతి, హరీష్, ఈవీ నరసింహారెడ్డి, అనుదీప్ దురిశెట్టి, కర్నాటి వరుణ్ రెడ్డి, విద్యాసాగర్, రాజేశ్వర్ రెడ్డి, మామిడి హరికృష్ణ, నర్సింగరావు, మనోహర్ బాబు, సర్వేష్ కుమార్ లు ఉన్నారు.


Tags:    

Similar News