ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే ఇలా ఉంటే..?

ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన విషయం అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-08-07 14:29 GMT

ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన విషయం అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్‌ లోని ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉందంటే రాష్ట్రంలో రైతుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారాయన. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను తీర్చేందుకు ఎలాంటి సహాయం చేయకపోగా వారిని కొత్త సమస్యల్లోకి నెడుతోందని ఆరోపించారు. ఇది ఏమాత్రం క్షమార్హం కాదన్న హరీష్ రావు... రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితమయ్యిందని విమర్శించారు.

"రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి. వారి సమస్యలను పరిష్కరించి కనీసం వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగకుండా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మహత్యాయత్నం చేసిన రైతుల వివరాలు సైతం ఆయన వెల్లడించారు.

సూసైడ్ చేసుకుని మరణించిన ఖమ్మం రైతులు..

జులై 1:

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో పురుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్.

కారణం: తన భూమిని కాంగ్రెస్ నాయకులు బలవంతంగా చెరువు శిఖంలో కలిపేశారని. సరిహద్దులు దున్నేసి ఆగం చేశారని ఆరోపణ.

ఆగస్టు 7:

ఖమ్మం రూరల్ మండలం జాన్ బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి అనే రైతు ఆగస్టు 4న పురుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆగస్టు 7వ తేదీన చనిపోయాడు.

కారణం: తన భూమిని మరో వ్యక్తి దౌర్జనంగా కబ్జా చేశాడని, అధికారులు పట్టించుకోలేదని, ఆరోపిస్తూ పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యాయత్నం చేసుకుని బయటపడిన వారు..

జులై 4:

కారేపల్లి మండలం ఆలియా తండకు చెందిన రైతు పచ్చిపాల భద్రయ్య. తన భూమి కబ్జా అయిందని పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు.

కారణం: తన భూమిని ఆర్టిఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్యయత్నం చేశాడు

జులై 8:

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం కు చెందిన మేడి సీతయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు.

కారణం :  కమలాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న తన భూమిలో పని చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారని ఆరోపించాడు.

జులై 9:

ఖమ్మం జిల్లా రఘునాథ్ పల్లి మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన రైతు ప్రసాద్ (32) ఆత్మహత్యాయత్నం. చికిత్స తర్వాత క్షేమంగా ఉన్నాడు. సుమారు ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించి కానిస్టేబుల్ లక్ష్మణ్ తో వివాదం.

కారణం : పోడు భూమి సాగు చేసుకుంటున్న భూమిని కానిస్టేబుల్ లక్ష్మణ్ తన కూతురు లావణ్య పేరుమీద పట్టా తీసుకున్నడని ఆరోపించిన ప్రసాద్.

Tags:    

Similar News