అస్వస్థ విద్యార్థులను పరామర్శించిన హరీష్ రావ్

న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలి;

Update: 2025-07-27 12:44 GMT

నాగర్ కర్నూల్ ఉయ్యాల వాడలో బాలికల గురుకుల పాఠశాలలో విషాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆదివారం మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిమాటికి ఢిల్లీ వెళుతున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు వినడానికి ఆయనకు ఓపిక లేకుండాపోయిందని హరీష్ రావు అన్నారు.

కలుషిత ఆహారం కేసులు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అధికారులు ఆయన మాట వినడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

సాంబారులో పురుగులు వస్తున్నట్టు విద్యార్థినులు తనకు ఫిర్యాదు చేశారని, సమయానికి భోజనం కూడా పెట్టడం లేదని హరీష్ రావు విమర్శించారు. తమపై కోపం ఉంటే కేసులు పెట్టి జైల్లో వేయండి అంతేగాని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హరీష్ రావ్ హెచ్చరించారు. కలుషిత ఆహారం కేసులను మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సుమోటాగా తీసుకోవాలని హరీష్ రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోతుందన్నారు.

Tags:    

Similar News