ప్రభాకరరావు ఇండియాకు వచ్చే రోజులు దగ్గరపడ్డాయా ?
ప్రభాకరరావు పెట్టుకున్న దరఖాస్తును అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది;
అమెరికా నుండి ఇండియాకు ప్రభాకరరావు వచ్చేసే రోజులు దగ్గరపడ్డాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజా పరిణామం ఏమిటంటే ప్రభాకరరావు పెట్టుకున్న దరఖాస్తును అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. తనను రాజకీయ శరణార్ధిగా పరిగణించి ఇండియాకు పంపించకుండా అమెరికా(America)లోనే శాశ్వతంగా ఉండిపోయేట్లుగా ప్రభాకరరావు ఆమధ్య అమెరికా ప్రభుత్వానికి రిక్వెస్టు పెట్టుకున్నాడు. అన్నీ కోణాల్లోను రిక్వెస్టును పరిశీలించిన డొనాల్డ్ జే ట్రంప్(Donald J Trump) ప్రభుత్వం రిక్వెస్టును రెజెక్ట్ చేసింది. తాజా పరిణామంతో ప్రభకరరావు అమెరికాలో ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకరరావు(Prabhakar Rao) ఏ1 నిందితుడు. కేసీఆర్(KCR) పాలనలో ప్రత్యర్ధులకు చెందిన వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిన విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచనంగా మారింది. తనను అరెస్టుచేస్తారన్న భయంతో కేసీఆర్ పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు ఇండియా నుండి అమెరికాకు పారిపోయాడు. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణకు హజరయ్యేట్లుగా ప్రభాకరరావును ఇండియాకు పిలిపించేందుకు పోలీసులు ఎన్నిప్రయత్నాలు సాధ్యంకాలేదు. తాను అమెరికాలోనే ఉండిపోయేట్లుగా నిందితుడు చాలాప్రయత్నాలు చేసుకున్నాడు. అలాంటి ప్రయత్నాల్లో రాజకీయ శరణార్ధిగా అమెరికాలోనే శాశ్వతంగా ఉండిపోవటం ఒకటి.
విచారణను తప్పించుకుంటు అమెరికాలోనే ఉండిపోయేట్లుగా ప్రభాకరరావు ఎత్తులకు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) పై ఎత్తులు వేశారు. పోలీసులు వేసిన పై ఎత్తుల్లో లుకౌట్ నోటీసు జారీచేయించటం, పాస్ పోర్టును రద్దుచేయించటం, ఇంటర్ పోల్(Inter Pol) అధికారుల సాయంతో ప్రభాకరరావును అదుపులోకి తీసుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసును జారీచేయించటం, నాంపల్లి కోర్టు ద్వారా జూన్ 20వ తేదీలోగా లొంగిపోయేట్లుగా ఆదేశాలు జారీచేయటం ముఖ్యమైనవి. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ అధికారులతో రెడ్ కార్నర్ నోటీసు జారీచేయించటంతో అమెరికా ప్రభుత్వం నిందితుడిని రాజకీయ శరణార్ధిగా గుర్తించటానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయంతో పాటు రెడ్ కార్నర్ నోటీసు అమల్లోకి రావటంతో నిందితుడు అమెరికా వదిలేసి ఇండియాకు వచ్చే రోజుల్లో దగ్గరలోకి వచ్చేసిందన్న విషయం అర్ధమవుతోంది.