కొలిక్కి వచ్చిన HCAvsSRH వివాదం

ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీయే, బీసీసీఐ మధ్య ఉన్న త్రి-పార్టీ ఒప్పందాన్ని తూచా తప్కుండా పాటించాలని ఇరు వర్గాలు నిశ్చయించుకున్నాయి.;

Update: 2025-04-01 14:24 GMT

కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషర్(HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య జరుగుతున్న వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కొన్ని రోజులుగా ఈ రెండిటి మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ కూడా జోక్యం చేసుకుని విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉప్పల్ స్టేడియంలో.. ఎస్‌ఆర్‌హెచ్ అధికారులతో హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణ, రోహిత్ సురేష్ పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలపై చర్చించుకున్న అనంతరం ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీయే, బీసీసీఐ మధ్య ఉన్న త్రి-పార్టీ ఒప్పందాన్ని తూచా తప్కుండా పాటించాలని ఇరు వర్గాలు నిశ్చయించుకున్నాయి.

పాత ఒప్పందం ప్రకారంమే స్టేడియం సామర్థ్యంలో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీయేకు కేటాయించనున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు పూర్తి సహకారం అందిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. అనంతరం తమ మధ్య ఉన్న వివాదాలన్నీ ముగిశాయని హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ సంయుక్తంగా ప్రకటించాయి. అదే విధంగా ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులను మెరుగైన అనుభవాన్ని అందించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.

ఈ చర్చల అనంతరం హెచ్‌సీయే అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అందులో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్, ఎస్‌ఆర్‌హెచ్, చర్చల్లో పాల్గొన్న తమ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యలో వారు వేగంగా స్పందించి జోక్యం చేసుకుని సమసయను పరిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ఉప్పల్ స్టేడియంలో మునుముందు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను మరింత విజయవంతం చేద్దామని కోరారు.

Tags:    

Similar News