తెలంగాణకు మరో పిడుగు లాంటి వార్త.. ఉదృతంగా మున్నేరు

ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది.

Update: 2024-09-07 18:44 GMT

ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

ఖమ్మంలో మళ్ళి భారీ వర్షాలు...

ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం ప్రజలు తీవ్ర అవస్థలు పడిన విషయం తెలిసిందే. ప్రజలు ఆ విపత్తు నుంచి కోలుకునే లోపే మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరదముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం వద్ద మున్నేరు మళ్లీ ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మున్నేరు ప్రవాహం 10 అడుగులకు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Tags:    

Similar News