రేవంత్‌పై కేసు పెట్టాలంటూ పిటిషన్.. అలా చెప్పలేమన్న కోర్టు..

సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2024-11-07 09:25 GMT

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్(BRS) నేతలను నిందిస్తూ సీఎం వ్యాఖ్యలు చేసిన కేసులు నమోదు చేయకపోవడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ కోరినట్లు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ‘‘సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారు. వాటిలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా పరిగణించి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం కుదరదు’’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ హైకోర్టు తీర్పు పెద్ద షాక్‌ అనే చెప్పాలి.

రేవంత్ ఏమన్నారంటే..

తెలంగాణలో ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య విమర్శనాస్త్రాలు సంధించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, మాట యుద్ధాలు ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా కూడా అంతే ఘాటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తాను పాల్గొన్న పలు సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలపై ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఘాటుగా విమర్శలు గుప్పించడంతో బీఆర్ఎస్ నేతలు చిన్నబుచ్చుకన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులను ఆశ్రయించారు. అయినా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పిటిషనర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. సీఎంపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం.

రేవంత్‌కు వాస్త పిచ్చి: హరీష్

తాజాగా సచివాలయంలో మార్పులు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ కూడా హరీష్ రావు.. రేవంత్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. రేవంత్‌కు ఉన్న వాస్తు పిచ్చితోనే అనవసరంగా సచివాలయంలో మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలానే మొన్న వాస్త సరిలేదని చెప్పి ఒక్క గేటు మార్చడం కోసం రూ.4కోట్లు ఖర్చు చేశారని, ఇదే విధంగా పూటకో మార్పు చేయాలని సీఎం రేవంత్ సూచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. తమ ప్రభుత్వం సచివాలయాన్ని చాలా పకడ్బందీగా నిర్మించిందని, గ్రీన్ టెక్నాలజీని వినియోగించి భవనాన్ని రూపొందించిందని చెప్పారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను కూడా తమ ప్రభుత్వం పూర్తిగా ఆచరించి ఈ సచివాలయాన్ని రూపొందించిందని వివరించారు. అదే విధంగా పాలన బాగుండాలంటే.. మార్పులు చేయాల్సింది సచివాలయంలో కాదని, అందులో పనిచేస్తున్న నేతల బుర్రల్లో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు హరీష్.

Tags:    

Similar News