కేటీఆర్‌పై నమోదైన పిటిషన్ కొట్టివేత
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.;
తెలంగాణలో కేసు పర్వం కొనసాగుతూనే ఉంది. విమర్శలు చేసిన నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసుపై విచారణ జరిగిన న్యాయస్థానం కీలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసునుకొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైనకేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకొని ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. కాగా ఈ కేసు విచారణలో వాదనలు వినిపించిన కేటీఆర్ తరపు న్యాయవాది.. రాజకీయ కక్ష్యల కారణంగానే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారన్నారు.