హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లపైకి..

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్

Update: 2025-09-22 10:02 GMT

హైకోర్టు ఆదేశాలను హైడ్రా ఉల్లంఘిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కేటీఆర్అన్నారు. గాజుల రామారంలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేయడం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. సోమవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేసిందన్నారు. సెలవు రోజు చూసుకొని రేవంత్ ప్రభుత్వం ఆదివారం పేదల ఇళ్లను కూల్చివేసిందన్నారు. గాజుల రామారం తర్వాత బోరబండలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేయనుందని కెటీఆర్ జోస్యం చెప్పారు. పేదల ఇళ్లకే హైడ్రా బుల్డోజర్లు వెళుతున్నాయని కాంగ్రెస్ పెద్దల ఇళ్లను ముట్టుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు దుర్గం చెరువుపై ఇల్లు కట్టినప్పటికీ హైడ్రా చూసి చూడనట్టు వ్యవహరిస్తోందన్నారు. మంత్రులు పొంగులేటి, వివేక్ తదితరులు ప్రభుత్వ స్థలాలు, చెరువులపైన ఇళ్లు కట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిందని, సర్దార్ ఇంటిని పునర్నిర్మించే బాధ్యత తనది అని కేటీఆర్ హామి ఇచ్చారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయినట్టేనని బిఆర్ఎస్ నేత జోస్యం చెప్పారు.

Tags:    

Similar News