యాదగిరి గుట్టకు పెరిగిన భక్తుల రద్దీ

శ్రావణమాసం తొలి ఆదివారం కావడంతో..;

Update: 2025-07-27 08:26 GMT

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహాస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు యాదాద్రికి చేరుకున్నారు. క్యూలెన్లలో బారులు తీరి నిల్చుండిపోయారు. సెలవు రోజు కావడంతో ఈ రద్దీ ఎక్కువైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెల్లవారు జామునుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాద విక్రయశాల, కొండ క్రింద సత్యనారాయణ స్వామి మండపం, లక్ష్మి పుష్కరిణిల భక్తులతో నిండిపోయింది. స్వామి, అమ్మవార్ల కళ్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.సర్వ దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Tags:    

Similar News