ట్యూమర్లకు ఆపరేషన్లు చేస్తున్న ఐపీఎస్ అధికారి

2026 సంవత్సరంలో లక్ష కోట్లరూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు

Update: 2025-12-05 07:45 GMT
Hydra Commissioner AV Ranganadh

ప్రభుత్వ భూములను కబ్జా చేయటాన్ని ఐపీఎస్ అధికారి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ట్యూమర్ తో సమానమని అభివర్ణించారు. శస్త్రచికిత్సలు చేసే వైద్యులకంటే తాము ఏమాత్రం తక్కువకాదన్నారు. వ్యాధులకు డాక్టర్లు చికిత్సలు చేస్తుంటే సమాజంలో పెరిగిపోతున్న కబ్జాలనే ట్యూమర్లకు చికిత్సలు చేసి తాము తొలగిస్తున్నట్లు చెప్పారు. మంచి ఆరోగ్యానికి చికిత్సచేసి ట్యూమర్లను తొలగించటం ఒకటే ఉత్తమమైన మార్గమన్నారు. ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ ఆస్తులు, భూములను రక్షిస్తున్నట్లు చెప్పారు. 2026 సంవత్సరంలో లక్ష కోట్లరూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతు గడచిన 15 నెలల్లో రు. 60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా రక్షించినట్లు తెలిపారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను విడిపించి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయటం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని కమిషన్ వివరించారు. కబ్జాల్లో ఉన్న ఎన్నో చెరువులను విడిపించి వాటిని ప్రభుత్వపరం చేసిన విషయాన్ని రంగనాథ్ గుర్తుచేశారు. కబ్జాలనుండి విడిపించిన చెరువుల్లో కొన్నింటిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. సున్నంచెరువు లాంటి మరికొన్ని చెరువులను తిరిగి ఉపయోగంలోకి తెచ్చినట్లు కూడా చెప్పారు.

కబ్జా చెరనుండి విడిపించి, సుందరంగా తీర్చిదిద్దిన చెరువల చుట్టుపక్కల జనాలంతా ఇపుడు చాలా హ్యాపీగా ఉన్నట్లు కమిషన్ వివరించారు. కాల్వలను కబ్జాలుచేసి డ్రైన్ వాటర్ సక్రమంగా వెళ్ళకుండా చేసిన నిర్మాణాలను కూడా గుర్తించామన్నారు. ఇలాంటి నాలాలపైన నిర్మించిన నిర్మాణాల్లో కొన్నింటిని ఇప్పటికే కూల్చేసి నాలాల ద్వారా డ్రైనేజి నీరు, వరదనీరు వెళ్ళేందుకు మార్గాన్ని ఏర్పాటుచేశామన్నారు.

Tags:    

Similar News