తొలిదశ ఎన్నికల తర్వాత మోదీ వెన్నులో వణుకు!?

తొలిదశ ఎన్నికల తర్వాత మోదీ వెన్నులో వణుకు మొదలైందా? కులగణన చేయడం బీజేపీకి, సంఘ్ పరివార్ కి రుచించడం లేదా..?

Update: 2024-04-23 08:18 GMT

తొలిదశ ఎన్నికల తర్వాత మోదీ వెన్నులో వణుకు మొదలైందా? కులగణన చేయడం బీజేపీకి, సంఘ్ పరివార్ కి రుచించడం లేదా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో మొదటి దశ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకునే పరిస్థితిలో మోదీ లేరన్నారు. పాంచ్ న్యాయ్ లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇవ్వడం బీజేపీకి, సంఘ్ పరివార్ కి రుచించడం లేదని విమర్శించారు.

కులగణన జరిగితే దేశంలో ఉన్న ఎస్సి, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని వారికి భయం పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇళ్ళు, బంగారం, సంపద గుంజుకుంటారని మోదీ ఆరోపిస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి స్థాయిలో దేశంలోని జనాభాకి నాయకత్వం వహించాల్సిన వ్యక్తి.. సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా మోదీ మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News