ఆర్డినెన్స్ చెల్లుతుందా? : డాక్టర్ కె. లక్ష్మణ్
కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందే;
బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ తీసుకొచ్చే ఆర్డినెన్స్ చెల్లుతుందా అని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. బిసీల విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ దొందుదొందే అని ఆయన అన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పంపిన బిసీ బిల్లు రాష్ట్ర పతి భవన్ వద్ద పెండింగ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ బిల్లు రాష్ట్ర పతి భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారు అని లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీ బిల్లు వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు అని కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పంపిన బిల్లు రాష్ట్రపతివద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు అసెంబ్లీలో గవర్నర్ ఆమోదిస్తారా, కోర్టుల్లో నిలబడుతుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. బిసీ బిల్లు కేంద్రానికి పంపి కాంగ్రెస్ చేతులు దులుపుకుందన్నారు. కేంద్రాన్ని బదనాం చేయడానికే బిసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిందన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ కేబినేట్ ఆమోదించడం అంటే బీసీలను వంచించడమేనని లక్ష్మణ్ అన్నారు.