జర్నలిస్టులకు పెన్షన్ కోసం విజ్ఞప్తి

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి కి వినతి పత్రం

Update: 2025-10-06 04:11 GMT

పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని వర్తింప చేస్తామని డి. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో 17వ అంశంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి చేసింది.

సంఘ నాయకులు కేశవరావు ,లక్ష్మణరావు, ఎన్. శ్రీనివాసరెడ్డి, బండారు శ్రీనివాసరావు ,సి .కేశవులు, ఫాజిల్, వేణుగోపాల్ లతో కూడిన బృందం ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కగారిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జర్నలిస్టుల సంఘ నాయకులు అప్పటి టిడిపి సీసీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈమేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించిన విషయం విధితమే.

దేశంలోని 19 రాష్ట్రాలలో పెన్షన్ పథకం అమలులో ఉన్నది. కర్ణాటకతో సహా పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలులో ఉన్నది. దీనికి ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు సానుకూలంగా స్పందిస్తూ దీనిపై కమిటీ వేసి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి అమలు జరిగేటట్లు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News