తెలంగాణ కొత్త సీఎస్‌గా కె రామకృష్ణారావు, ఐఎఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ తెలంగాణ సర్కారు ఆదవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.;

Update: 2025-04-27 14:10 GMT
కొత్త సీఎస్‌గా కె రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ తెలంగాణ సర్కారు ఆదవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్థుత చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి ఏప్రిల్ 30వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆమె స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన రామకృష్ణారావును నియమించింది. ప్రస్థుతం ఉన్న సీఎస్ శాంతికుమారి గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరుగా పనిచేశారు. మళ్లీ ఆదిలాబాద్ కలెక్టరుగా పనిచేసిన కె రామకృష్ణారావునే కొత్త సీఎస్ గా రేవంత్ సర్కారు నియమించడం విశేషం.


స్మితా సబర్వాల్ కు కీలక పదవి
ఇటీవల ఎక్స్ పోస్టులతో వివాదం రేపిన స్మితా సబర్వాల్ కు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్ గా శశాంక్ గోయల్ ను , ఇండస్ట్రీ, ఇన్వెస్ట్ మెంట్ సెల్ సీఈఓగా జయేశ్ రంజన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కార్యదర్శిగా ఇలంబర్తిని, జీహెచ్ఎంసీ కమిషనరుగా ఆర్వీ కర్ణన్ ను, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనరుగా కె శశాంకను నియమించారు.

జెన్ కో సీఎండీగా ఎస్ హరీశ్ ను, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీగా నిఖిలను, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరుగా సంగీతం సత్యనారాయణను, దేవాదాయ శాఖ డైరెక్టరుగా ఎస్ వెంకటరావు, సెర్చ్ అదనపు సీఈఓగా కాత్యాయనీదేవి, ఇండస్ట్రీ ఇన్వెస్ట్ మెంట్ సెల్ అదనపు సీఈఓగా నర్సింహారెడ్డిని, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనరుగా హేమంత్ సహదేవ్ రావు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా ఫణీంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనరుగా కధిరవన్, హైదరాబాద్ అదనపు కలెక్టరుగా విద్యాసాగర్, హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News