'ఆ విమాన ప్రయాణమే నాపై కుట్రలకు తెరలేపింది'-కవిత

హరీష్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఓకే విమానంలో ప్రయాణం చేశారని ఆరోజే తనపై కుట్రకు తెరలేపారని తీవ్ర విమర్శలు చేసిన కల్వకుంట కవిత;

Update: 2025-09-03 09:19 GMT

బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని కేసీఆర్ తనయ , తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత వ్యాఖ్యానించారు.తనపై కుట్రలు చేసిందీ, తనను పార్టీ నుంచి పంపించడానికి ప్లాన్ చేసిందీ హరీష్ రావు, సంతోష్ రావు అంటూ కవిత మరోమారు కుండబద్దలు కొట్టారు. తనపై కుట్రలు మొదటి నుంచి జరుగుతున్నాయన్నారు.హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్రలకు తెరలేపారన్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ విమాన ప్రయాణం తోనే కుట్రలు
హరీష్ రావు,రేవంత్ రెడ్డిలను తాను తాను సూటిగా అడుగుతున్నానంటూ కవిత అన్న మాటలు "నాపై కుట్రలు ఎప్పటి నుంచీ స్టార్ట్ అయినయ్, ఎప్పుడైతే హరీష్ రావుగారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కో, హైదరాబాద్ నుంచి ఢిల్లీకో ప్రయాణం చేసినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాళ్లు పట్టుకుని సరండర్ అయిన తరువాత నాపై కుట్రలు స్టార్ట్ అయ్యాయి" అన్నారు. తమ కుటుంబంపైనా కుట్ర జరిగిందన్న కవిత ఆరోపణలు ఆమె మాటల్లోనే "ఆ విమాన ప్రయాణంలోనే నా కుటుంబాన్ని విడగొట్టాలన్న కుట్రలు మొదలయ్యాయి.నేను ఛాలెంజ్ చేస్తున్నాను ..రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావుగారు మీరు చెప్పాలి ఆ ప్రయాణం జరిగిందా లేదా చెప్పాలి" అంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. జాగృతి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు."నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో పని చేశా. హాస్టల్స్, గురుకులాల్లో జరిగుతున్న అక్రమాలపై పోరాటం చేశా.. తెలంగాణ తల్లి స్వరూపం మారిస్తే నిరసన తెలిపా, భద్రాచలం ఐదు గ్రామాలపై పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చా,గులాబీ కండువా కప్పుకొని.. బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడి 47 నియోజకవర్గాల్లో పర్యటించా" ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు ఎలా అవుతాయి అంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ పెద్దలు వీటిపై పునరాలించుకోవాలన్నారు.
హరీష్ 'ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్'
తాను చెప్పిన ఆ ఇద్దరు పని కట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని , హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అంటూ నిలదీశారు." హరీష్‌ ట్రబుట్‌ షూటర్‌ కాదు.. బబుల్‌ షూటర్‌. ట్రబుట్‌ క్రియెట్‌ చేసి దీన్ని సాల్వ్‌ చేసినట్టు చెప్పుకుంటారు. ఇష్టం వచ్చినట్లు స్టోరీలు ఇస్తే సరిపోతుందా " అని ప్రశ్నించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నావ్ అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి.."రామన్నను గడ్డం పట్టుకొని అడుగుతున్నా.. నాపై కుట్రలు జరుగుతుంటే కనీసం ఫోన్ చేసి అడగరా? 103 రోజులవుతుంది నాతో మాట్లాడి, ఒక్క మాట మాట్లాడారా? ఏం జరిగినా నేను కేసీఆర్ గారికి, రామన్నకు హానీ జరనివ్వను" అంటూ ఉద్వేగానికి కవిత గురయ్యారు.
తనపై జరిగిన కుట్రలు రామన్నపై కూడా జరిగే ఛాన్స్ ఉంది. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్‌ రావు కాంగ్రెస్ తో పాటు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారంటూ, డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తానను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారన్నారు. హరీష్ రావు అవినీతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
Tags:    

Similar News