Kavitha | ‘స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటాం’

బీసీ రిజర్వేషన్లపై కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Update: 2024-12-27 10:58 GMT

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలకంగా మారుతున్నాయి. అధికారి ప్రతిపక్షాల మధ్య ప్రతి రోజూ ఏదో ఒక అంశంలో మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. ఏ ఒక్క హామీని నిర్లక్ష్యం చేసిన బీసీల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని అన్నారు. అలా కాకుండా బీసీ రిజర్వేషన్లను ఆలస్యం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. బీసీల జనాభా ఎంత ఎంతో తెలియకపోతే హామీలు ఎలా ఇచ్చారని? ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 50శాతానికి పైగా బీసీలే ఉన్నారని, కానీ కాంగ్రెస్ మాత్రం 42శాతమే ఉన్నారని ఎలా చెప్తోందని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండల కేంద్రాలు, జిల్లాలు, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీ జనాభాను వెల్లడించకే ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.

Tags:    

Similar News