‘కాంగ్రెస్‌వి కాకిలెక్కలు’.. కులగణన లెక్కలపై కవిత

కులగణనకు సంబంధించిన గణాంకాలను కాకిలెక్కలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-02-03 09:42 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించిన గణాంకాలకు కాంగ్రెస్ ప్రకటించింది. కాగా అవన్నీ కూడా కాకిలెక్కలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కవిత. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్నారు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో లఘు చర్చలు చేయడం ద్వారా ఎటువంటి లాభం ఉండదని అన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ఎందుకంత చిన్నచూపు? అని ప్రశ్నించారు.మేమెంతుంటే.. మాకంత వాటా కావాలని రాహుల్ గాంధీ నినాదం చేశారని, దాని ప్రకారం తెలంగాణలో 46.3 శాతం బీసీ హిందువులు, 10శాతం బీసీ ముస్లింలు ఉన్నారని, మొత్తం కలిపి జనాభాలో బీసీలు 56.3శాతం ఉన్నారని వివరించారు కవిత. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి నాయకుడు చేసిన నినాదం ప్రకారమే 56.3శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కవిత. రిజర్వేషన్లు చేయాలని రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని నిలదీశారు ఎమ్మెల్సీ.

ఉద్యమంతోనే కవిషన్ ఏర్పడింది

‘‘ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బిసి ల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉన్నదా?నిన్న ఆగమాగం లెక్కలు పెట్టినారు రేపు అసెంబ్లీలో పెడుతారట. పెడితే బిల్లు పెట్టండి. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలు. మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్న అంటారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తున్నది. కాబట్టి 15 రోజులు రివ్యూకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో మేము అందరూ పెద్దలను కలుస్తాము పోరాటాలకు మేము ఎప్పుడు సిద్ధం. కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం అన్నారు .ఇప్పుడు మైనార్టీలతో కలుపుకుని 56.3% బీసీలను మీరే అంటున్నారు. మరి 56.3% రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోండి’’ అని డిమాండ్ చేశారు.

లెక్కలు తేడాగా ఉన్నాయే..?

‘‘2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3.68కోట్ల జనభా ఉంది.అప్పుడు నాలుగేళ్ల వ్యవధిలో చేసిన సర్వేలో 20 లక్షల ఇళ్లు పెరిగాయి. అలాంటిది ఇప్పుడు 10 సంవత్సరాల వ్యవధి తర్వాత సర్వే చేస్తే ఎంత శాతం ఇళ్లు పెరగాలి, జనభా ఎంత మేర పెరగాలి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో రాష్ట్రంలో 1.15కోట్ల ఇళ్లు ఉన్నాయని, జనాభా 3.70కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. 2011-2014 మధ్య 20 లక్షల ఇళ్లు పెరిగే.. 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో 60 లక్షల కుటుంబాలు పెరగాలి కదా? ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50-52శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం 46.3శాతం మాత్రమే బీసీలు ఉన్నట్లు చెప్పడం బాధాకరం. ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News