‘బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేదేలే..!’

కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న కవిత.;

Update: 2025-09-08 12:12 GMT

బీసీ రిజర్వేషన్ల విషయంలో కవిత స్పీడ్ పెంచారు. రిజర్వేషన్ల సాధనకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో బీసీ నాయకులతో కవిత సమావేశమయ్యారు. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందంటూ ప్రభుత్వంపై కవిత విమర్శలు గుప్పించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని గుర్తు చేశారు.

‘‘ఎన్నికల సమయంలో హామీలతో హోరెత్తించిన రాహుల్, ప్రియాంక గాంధీలు మళ్ళీ తెలంగాణకు రాలేదు. తెలంగా బీసీల రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో వాళ్లు ఎందుకు ప్రస్తావించలేదు? ప్రజలకు వివరణ ఇవ్వండి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. బీసీ సంఘాలను కలుపుకుని సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాద్గించే వరకు వెనక్కి తగ్గేది లేదు’’ అని కవిత స్పష్టం చేశారు.

కవిత ప్లాన్ అదేనా..!

కవిత ఎపిసోడ్.. బీఆర్ఎస్‌లో ఊహించని ప్రకంపనలు సృష్టించింది. హరీష్ రావు, జోగినపల్లి సంతోష్‌పై అవినీతి ఆరోపనలు చేశారామే. వాటి ఫలితంగానే ఆమెను కేసీఆర్.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరుసటి రోజే ఆమె.. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలపై కూడా ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుతం కవిత.. తన రాజకీయ ప్రయాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆమెను చేర్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు. అదే విధంగా సొంత పార్టీ పెట్టి నెగ్గుకురావడం అనుకున్నంత ఈజీ కాదని కవితకు కూడా తెలుసు.

అందుకే ఇప్పుడు అత్యంత కీలకంగా ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఫోస్ పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బీసీలకు న్యాయం అందించాలన్న అజెండాతో ఆమె ముందడుగు వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించి.. దాని సహాయంతో తెలంగాణ రాజకీయాల్లో కీ ప్లేయర్‌గా మారాలని కవిత యోయిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఏ ఎన్నికలు జరగవని కవిత చెప్పారు. ఇలాంటి స్టేట్‌మెంట్ల ద్వారా బీసీ నేతలను తనవైపు తిప్పుకోవాలని కవిత చూస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర జనాభాలో అధికశాతం ఉన్న బీసీల మద్దతుతో రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచుకోవాలని కవిత ప్లాన్ చేస్తుండొచ్చు’’ అని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Tags:    

Similar News