కెసీఆర్ ను అసెంబ్లీకి రావాలనడంపై కవిత స్పందన
అది డైవర్షన్ పాలిటిక్స్;
By : B Srinivasa Chary
Update: 2025-07-10 13:59 GMT
అసెంబ్లీకి కెసీఆర్ రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే కోరడం డైవర్స్ పాలిటిక్స్ భాగమని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి విస్తృత సమావేశం గురువారం కొత్తగూడెంలో జరిగింది. సిక్స్ గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. మహిళలకు నెలకు రూ2, 500 ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదన్నారు. పించన్లు పెంచుతామని పెంచుతలేదు. వీటన్నిటిపై చర్చించడానికి తాను సిద్దమని కవిత స్పష్టం చేశారు. మహిళలందరం కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ కు వస్తామని అక్కడ చర్చిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత సవాల్ చేశారు.
కవిత ఇటీవలి కాలంలో కాంగ్రెస్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.