కెసిఆర్ ఇమేజ్ కు 'లగ్జరీ కారు' ప్రమాదం

ఈ కార్లని ఏంచేస్తారు? సిఎంగా రేవంత్ వాడతారా? లేక ప్రగతి భవన్ లాగా ఉప ముఖ్యమంత్రి భట్టి కి ఇస్తారా లేక అమ్మేస్తారా, ఎగ్జిబిషన్ గ్రౌండ్సలో ప్రదర్శనకు పెడతారా

Update: 2023-12-28 03:27 GMT
(Pic: Wikimedia Commons)

ఉద్యమకారుడు మృత్యముఖంలో తలపెట్టి బయటకు వచ్చిన నేత ప్రచారం చేసుకున్న కుల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి  అబ్బుర పరిచే ఆసక్తి కరమయిన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఉద్యమకారుడు అనే ఇమేజ్ ని దెబ్బతీసే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. పదేళ్ల అధికారంలో ఉన్నపుడు బయటకు పొక్కని అనేక విషయాలు ఒకటొటకటే బయట పడి, ముఖ్యమంత్రిగా ఆయన ఎంత  లగ్జరీగా బతికారో తెలిపే విషయాలు బయటపడుతున్నాయి.  ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ లగ్జరీ కార్ల వ్యవహారం బయటపెట్టారు. ఇది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవడం కష్టం. అంత ఖరీదైన కార్లు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వాడుతున్న దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి బయటపెట్టిన మాజీ ముఖ్యమంత్రి లగ్జరీ కార్ల వివరాలు ఇవే. ఇదే కెసిఆర్ సృష్టించిన సంపద అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో వ్యాఖ్యానించారు.

ఈ ఖరీదైన కార్లగురించి ఎవరో ఒక అధికారి ముఖ్యమంత్రికి చెవిన వేశాడు. ఆయన జనం ముందు ఈ విషయం  పెట్టారు.


మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనకోసం  ఒకటి కాదు, రెండు కాదు,  మొత్తం 22 కొత్త ల్యాండ్ టోయోటా క్రూజర్ల్ సిద్ధం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వెల్లడించారు.

తాను మూడో సారి ము ఖ్యమంత్రి కాగానే ఈ ఖరీదైన విలాసవంతమయిన కార్లలో తిరగాలని ఆయన ఆశపడ్డారు.

 ఈ 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల కార్లను కెసిఆర్ ప్రభుత్వం కోనుగోలు చేసిందని వాటిని విజయవాడలో దాచి పెట్టారని ఆయన బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు.

మూడోసారి అదికారంలోకి వస్తామని భ్రమలో ఉండి ప్రజా సొమ్ము విచ్చల విడిగా ఖర్చు పెట్టారని చెబుతూ ఈ విషయం తెలుసునేందుకు తానకు చాలా సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ కారు ధర మూడు కోట్ల పైబడి ఉంటుంది. అంటే రు. 66 కొట్లు ఖర్చు పెట్టి విలాసవంతమయిన కార్లు కొనుగోలు చేశారన్న మాట.

వీటన్నింటికి బుల్లెట్ ప్రూఫ్ చేసే మరొక 15 కోట్లు ఖర్చవుతుంది. ఈ కార్ల లో శాటిలైట్ సమాచార వ్యవస్థ కూడా ఉందని మీడియా రాస్తున్నది.

వందల కార్లు ఉన్నపుడు మరీ ఇంతఖరీదైన కార్లు కొనాలనుకోవడమేమిటని రేవంత్ ఆశ్చర్య పోయాడు.

ఇదే కెసిఆర్ సృష్టించిన సంపద అని ఆయన ఆశ్చర్యపొయాడు.  తెలంగాణ ప్రజలను విస్మయపరిచాడు.

ఈ కార్లని కొని ఒక కార్గో విమానం ద్వారా వాటిని విజయవాడ వీరపనేని గూడెంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న త్రిహాయని ఇంజనీరింగ్ వర్క్స్ ప్రవైట్ లిమిటెడ్ సంస్థకు పంపించి అన్ని అత్యాధునిక హంగులు సమకూర్చిపెట్టమన్నారట. చుట్టూ పక్కల ఏంజరుగుతున్నదో కారు లోపలి స్క్రీన్ లో చూడవచ్చునట. ఎన్నికల ముందే ఈ కార్లలో కూర్చొనే యోగం కెసిఆర్ దక్కలేదు. కారణం.ఈ కంపెనీ నుంచి జపాన్ భాగస్వామి వెళ్లిపోవడమే. దీనితో ఆలస్యమయింది.

ఈ కార్లని ఏంచేస్తారు?

అదే రేవంత్ రెడ్డి ముందన్న ప్రశ్న. ఆయన వాడతారా? లేక ప్రగతి భవన్ ని అప్పగించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి కి ఇస్తారా లేక అమ్మేస్తారా. లేక హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్సలో శాశ్వత ప్రదర్శనకు పెడతారా తెలియదు. 

రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ త్రిమూర్తులు ( కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు) గురించి తీవ్రమయిన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా దాదాపు ఒకలక్ష కోట్లు దోచుకుని  పారిపోయారని అన్నారు.  వీళ్ల సంపాదన ఏవేవో కార్యక్రమాలు చేపట్టి ఖజానాను లూటీ చేశారని అన్నారు.

ఈ తీవ్రమయిన విమర్శకు బిఆర్ ఎస్ నాయకత్వం నుంచి ఎలా ంటి స్పందన వస్తుందోచూద్దాం.


Tags:    

Similar News