కేసీఆర్ ధైర్యం చేస్తున్నారు..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉత్కంఠకి తెరపడింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే ప్రశ్నకి సమాధానం దొరికేసింది.

Update: 2024-07-22 15:29 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉత్కంఠకి తెరపడింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే ప్రశ్నకి సమాధానం దొరికేసింది. ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. అవును ఇది నిజం. అయితే ఆయన బడ్జెట్ రోజున అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక తెలంగాణలో ప్రతిపక్షనేతగా మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారు. 

అయితే ఓటమి తర్వాత ప్రతిపక్షనేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి ఆయనకి ధైర్యం సరిపోలేదని విమర్శలు వినిపించాయి. తాను ఏమాత్రం సహించలేని రేవంత్ ని సీఎం గా అసెంబ్లీలో ఎదుర్కోలేక గత అసెంబ్లీ సమావేశాలకు ఆయన అటెండ్ అవలేదనే ఆరోపణలూ వచ్చాయి. ఈసారి కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం డౌటే అని భావించారంతా. కానీ అంచనాలకు భిన్నంగా కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ధైర్యం చేశారు. నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్ధమయ్యారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో శాసనసభపక్ష స‌మావేశం..

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంద‌రూ హాజ‌రు కావాల‌ని పార్టీ అధినాయ‌క‌త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.

Tags:    

Similar News