పోచారం, గుత్తా అమిత్ లకు కీలక పదవులు

మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్ లకు కీలక పదవులు వరించాయి.

Update: 2024-08-20 16:39 GMT

మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్ లకు కీలక పదవులు వరించాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆయనకి కేబినెట్ హోదాను సైతం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. 

 

టీడీపీలో సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ ఓటమి పాలవడం, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

 

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు  ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆయనకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది రేవంత్ సర్కార్. 

Tags:    

Similar News