తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్

సెక్స్ వర్కర్లుగా నటిస్తూ డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్లు 50 మంది అరెస్ట్

Update: 2025-11-27 14:34 GMT

డ్రగ్ రహిత తెలంగాణలక్ష్యంగా ఈగల్ టీం చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్ , విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తున్న డ్రగ్ నెట్ వర్క్ ను ఈగల్ టీం ఛేదించింది. ఏకకాలంలో ఈ ప్రాంతాల్లో జరిపిన దాడులు సత్పలితాలనిచ్చాయి. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఈగల్ టీం ఈ దాడులను నిర్వహించింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ నుంచి 100 మంది అధికారులు, ఈగల్ టీం నుంచి 124 మంది అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. విసా గడువు ముగిసిన 50 మంది నైజీరియన్లు ఇక్కడే తిష్ట వేశారు. మెహ్రౌలి, సంత్ నగర్, ప్రతాప్ ఎన్ క్లేవ్, చంద్రనగర్, తదితర 20కి పైగా ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినప్పుడు నైజీరియన్ల గుట్టు రట్టయ్యింది. అరెస్టయినవారంతా ఒక పెద్ద నైజీరియన్ డ్రగ్ కార్టెల్ లో కీలక సభ్యులని పోలీసుల విచారణలో తేలింది. సెక్స్ వర్కర్లుగా ఉంటూ డ్రగ్ విక్రయం చేస్తున్న మ్యూల్ అకౌంట్లను ఈగల్ టీం గుర్తించింది.

Tags:    

Similar News