బావ మీటింగులో కేటీఆర్ కు ఇంత అవమానమా ?

ఇంకేదైనా నియోజకవర్గంలో జరిగుంటే వ్యవహారం ఎంత సీరియస్ అయ్యేదో తెలీదు.

Update: 2025-11-27 12:23 GMT
BRS meeting without working president KTR photo

ప్రత్యర్ధిపార్టీ నేతలు, కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారని కాదుకాని బీఆర్ఎస్ పార్టీలో ఏమిజరుగుతోందో నిజంగానే చాలామందికి అర్ధంకావటంలేదు. కొద్దిరోజులుగా(Kavitha)కవిత ఒకే ఆరోపణను పదేపదే చేస్తున్నారు. అదేమిటంటే తొందరలోనే పార్టీని మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ముంచేస్తారని. కేసీఆర్(KCR) కళ్ళకు హరీష్ గంతలు కట్టారని, హరీష్ తో కేటీఆర్(KTR) జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసంవస్తుందని. పార్టీని హరీష్ తొందరలోనే కబ్జాచేస్తాడని కవిత చాలాసార్లు ఆరోపించారు. కవిత ఆరోపణలకు ఊతమిచ్చేట్లుగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ జరిగింది.

సిద్దిపేట అంటే తెలుసుకదా హరీష్ రావు ఇలాకా. గురువారం సిద్దిపేటలో దీక్షా దివస్ పేరుతో హరీష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఒకమీటింగ్ జరిగింది. ఆ మీటింగుకు సంబంధించి వేదికమీద పెద్ద బ్యానర్ ఏర్పాటుచేశారు. ఆ బ్యానర్లో పార్టీ అధినేతగా ఒకవైపు కేసీఆర్ సార్ ఫొటో ఉంది. మరోవైపు హరీష్ రావుతో పాటు మెదక్ ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి ఫొటో ఉంది. బ్యానర్ కింద భారత రాష్ట్ర సంఘం, సిద్దిపేట అనిరాసుంది. అంతా బాగానే ఉందికాని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో ఎందుకులేదు ? బ్యానర్లో కేటీఆర్ ఫొటోను ప్రింట్ చేస్తే కదా కనబడేందుకు.

కారణం తెలీదు, ఎవరు బ్యానర్ ప్రింట్ చేయించారో తెలీదుకాని కేటీఆర్ ఫొటో లేకుండానే బ్యానర్ తయారైపోవటం, మీటింగ్ కూడా అయిపోయింది. ఇంకేదైనా నియోజకవర్గంలో జరిగుంటే ఇదేమంత సీరియస్ వ్యవహారం అయ్యుండేదికాదేమో. స్వయంగా సిద్దిపేట నియోజకవర్గంలో అదికూడా హరీష్ పాల్గొన్న మీటింగు తాలూకు బ్యానర్లోనే కేటీఆర్ ఫొటోమాయమైపోవటం ఇపుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ విషయమై కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వారియర్స్ ‘కవితక్క అప్ డేట్స్’ ఖాతాలో ప్రముఖంగా ట్రోలింగ్ జరుగుతోంది.

‘‘మొన్న కవితక్కని పార్టీనుండి సస్పెండ్ చేశారు’’. ‘‘ఇవ్వాళ రామన్న ఫొటోలేదు..రేపు కనీసం కేసీఆర్ సార్ ఫొటో అయినా ఉంచుతాడా మన సిద్దిపేట మోడల్’’ అంటు కవితక్క అప్ డేట్స్ లో హరీష్ పై విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. ‘‘దీక్షా దివస్ మీటింగులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ఫొటో ఎందుకు పెట్టలేదో మీ బబుల్ షూటర్(ట్రబుల్)ను అడిగి తెలుసుకోండి’’ అంటు సెటైర్లు పేల్చుతున్నారు. మరి దీనికి హరీష్ లేదా హరీష్ మద్దతుదారులు ఏమి సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News