కుప్పకూలిన కినారా గ్రాండ్ హోటల్‌ లిఫ్ట్

ఆదివారం హైదరాబాద్‌లోని అల్కాపురి క్రాస్ రోడ్స్‌ లో ఉన్న నాగోల్‌ లోని కినారా గ్రాండ్ హోటల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతో హోటల్ లిఫ్ట్ కుప్పకూలింది.

Update: 2024-05-27 09:27 GMT

ఆదివారం హైదరాబాద్‌లోని అల్కాపురి క్రాస్ రోడ్స్‌ లో ఉన్న నాగోల్‌ లోని కినారా గ్రాండ్ హోటల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతో హోటల్ లిఫ్ట్ కుప్పకూలింది. హోటల్ లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పార్కింగ్ లోకి ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో వీరబ్రహ్మమ్మ, రవిశంకర్ రెడ్డి, మణికంఠ గుప్తా, మనోహర్, షాజీద్ బాబా, కళ్యాణ్ కుమార్ లతో పాటు మరో ఇద్దరికి తీవ్ర రక్తస్రావమైంది.

హోటల్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలగానే బాధితులు పెద్దగా కేకలు వేయడంతో హోటల్ లో ఉన్నవారంతా ఘటనా స్థలానికి చేసురుకున్నారు. లిఫ్ట్ కూలినప్పుడు డోర్లు తెరుచుకోవడంతో గాయపడినవారిని బయటకి తీసి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. క్షతగాత్రులను అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన నాగోల్‌ పోలీసులు...

లిఫ్ట్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. ప్రమాదకర పరిస్థితికి లిఫ్ట్‌ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కినారా గ్రాండ్ హోటల్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదంలో హోటల్ బాధ్యత ఎంత ఉందో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News