మేం అధికారంలో రాగానే ఆ పేర్లన్నీ రద్దు చేస్తాం: కెటీఆర్

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు తగదు;

Update: 2025-06-28 15:10 GMT

మేం అధికారంలో రాగానే ఆ పేర్లన్నీ రద్దు చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కెటిఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆర్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు. ఈ క్యాంటీన్ల పేరును ఇందిరా క్యాంటిన్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరు మార్పుపై కెటీఆర్ ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు.

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుమార్పు సమంజసం కాదన్నారు. తాము అధికారంలో రాగానే ఆ పేర్లన్నీ రద్దు చేస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఢిల్లీ బాస్ లకు విధేయత చూపించాలనుకుంటే మీ పేరును రాజీవ్ లేదా జవహార్ అనే పేర్లు ఎందుకు పెట్టుకోకూడదని కెటిఆర్ రేవంత్ రెడ్డికి చురకలంటించారు.

Tags:    

Similar News