పొంగులేటి బాంబులన్నీ తుస్సులే.. ఒక్కటీ పేలదు.. కేటీఆర్ చురకలు

‘అతి త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయి’ అన్న పొంగులేటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చలకు దారి తీశాయి. ‘అతి త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయి’ అన్న పొంగులేటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చలకు దారి తీశాయి.

Update: 2024-10-25 09:16 GMT

‘అతి త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయి’ అన్న పొంగులేటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చలకు దారి తీశాయి. పొంగులే వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటని ప్రజలు సైతం తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ తుస్సు బాంబులేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. పొంగులేటి బాంబులకు కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా అసలు పొంగులేటి చెప్తున్న బాంబులు ఏంటని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ఎలాంటి బాంబులైనా తాము భయపడే పరిస్థితి లేదని, చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి వాళ్లతోనే పోరాడామని, ఇప్పుడు వీళ్లో లెక్కా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కచ్ఛితంగా చెప్తున్నా పొంగులేటి చెప్పే బాంబులన్నీ తుస్సు మనేవే. ఒక్కటి కూడా పేలదు’’ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి. కాంగ్రెస్ పాల్పడుతున్న అవినీతిని, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ పాలనతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు హాజరైన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏ బాంబుకూ భయపడం

‘‘ఏం పీక్కుంటారో పీక్కోండి.. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. మీ బాంబులకు భయపడతామా. దొంగ కేసులు పెడితే పెట్టుకోండి. నీ ఈడీ కేసులు, మోదీ కాళ్ళు మొకకిన బాంబుల గురించి చెప్పొద్దు. చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటోళ్లతోనే విరామం లేకుండా కొట్లాడాం. ఈ చిట్టినాయుడు ఓ లెక్కా. అడ్డమైన కేసులతో జైలుకు పంపితే పంపు. మేం అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ ట్యాక్స్‌లపై మేం లెక్కలు తేలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటపెడతాం. చావుకు భయపడే రకాలం కాదు మేము’’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

విద్యుత్ వ్యాపారం కాదు

‘‘తెలంగాణలో కరెంట్ కోతలు అధికమయ్యాయి. ప్రతి రోజూ కరెంట్ కోతలు సంభవిస్తున్నాయి. విద్యుత్‌ను ఒక వ్యాపారంలో చూడకూడదు. విద్యుత్‌ను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలి. ఇప్పుడు ఆ విద్యుత్ ఛార్జీలను పెంచి పేదల నడ్డి విరిచేలా సర్కార్ పనితీరు ఉంది. దాదాపు రూ.963 కోట్ల విద్యుత్ చార్జీలను ప్రజలపై రుద్దుతున్నారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు మేము పూర్తిగా వ్యతిరేకం. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ విషయంలో ఒక్కసారి కూడా ప్రజలపై భారం పడకుండా అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితో ఒక్కో యూనిట్ ధర రూ.50 రూపాయలా? అదెలా కుదురుతుంది. ప్రభుత్వ ఖజానాను లాక్కోడం కోసం సీఎంరేస్ ఆహారం ఉంటోంది. తెలంగాణోని పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది 11 నెలలుగా ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోయింది’’ అని మండిపడ్డారు.

ఇంతకీ పొంగులేటి ఏమన్నారంటే..!

ఒకటి రెండు రోజుల్లోనే ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్(BRS)లో ఎవరో కీలక నేతలపై కేసులు పెట్టి లోపలేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అర్ధమవుతోంది. దీన్నే పొంగులేటి(Ponguleti SrinivasaReddy) పొలిటికల్ బాంబులని చెప్పింది. కొత్తగా కేసులు పెట్టకపోతే ఇప్పటికే నమోదైన కేసుల్లో అరెస్టుచేసే అవకాశాలున్నాయి. ఇపుడీ విషయంపైన జోరుగా చర్చలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే దక్షిణకొరియా(South Korea), సియోల్(Seoul) పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనే. పొంగులేటి సియోల్ లో వెంటతీసుకుపోయిన మీడియా(Media)తో మాట్లాడుతు ఒకటి, రెండు రోజుల్లోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు చెప్పారు.

ఆ బాంబుల పేలుళ్ళల్లో ప్రధాన నేతలే ఉంటారని కూడా చెప్పారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి విషయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచబోతున్నట్లు చెప్పారు. తప్పుచేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళయినా వదిలేదని సినిమా టైపు హెచ్చరిక చేశారు. ప్రధాన నేతలను లోపలేసేందుకు అవసరమైన ఆధారాలతో ఫైళ్ళు సిద్ధమైనట్లు కూడా పొంగులేటి చెప్పారు. కక్షసాధిపులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ దిగదని అయితే చేసిన తప్పులను కూడా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. గతంలో జరిగిన తప్పులు, అవినీతి విషయంలో తాము కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కావటంలేదన్నారు. జరిగిన అవినీతి మొత్తానికి ఆధారాలను సేకరించి పక్కగానే చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News