‘కేటీఆర్ చిన్నపిల్లాడిలా మాట్లాడకు’

ఫామ్ హౌజ్ కి పరిమితం అయిన కేసీఆర్ కి ఎం తెలుస్తుంది అభివృద్ధి. బిఅరెస్ చెయ్యని పనులు మేము చేశాము.. అదే ప్రసంగం లో గవర్నర్ చెప్తుంటే జీర్ణించుకోలేక పోయారన్నారు.;

Update: 2025-03-12 12:32 GMT

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్ ఎలా ప్రసంగిస్తారో వారికి తెలియదా? అని ప్రశ్నించారు. గతంలో మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో మీ పార్టీ సభ్యులు వ్యంగ్యంగా మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారని అన్నారు. సభలో గవర్నర్ ఎలా మాట్లాడ్తారు అనే ఇంగిత జ్ఞానం బిఅరెస్‌కు లేదా? అని నిలదీశారు.

‘‘క్యాబినెట్ ఆమోదం తెలిపిన అంశాల పైనే గవర్నర్ ప్రసంగం లో చెప్పారు. పోకిరి ఎమ్మెల్యేలు బిఅరెస్ లో ఉన్నారు అలవాటుగా అదే ధోరణితో మాట్లాడ్తున్నారు. ఫామ్ హౌజ్ కి పరిమితం అయిన కేసీఆర్ కి ఎం తెలుస్తుంది అభివృద్ధి. బిఅరెస్ చెయ్యని పనులు మేము చేశాము అదే ప్రసంగం లో గవర్నర్ చెప్తుంటే జీర్ణించుకోలేక పోయారు. 10 ఎడ్ల లో బీద వాడికి ఒక రేషన్ కార్డు,డబ్బులు బెడ్ రూమ్ ఇచ్చిన పాపాన పోలె. బిఅరెస్ చేసిన సర్వే ఎందుకు టేబుల్ చెయ్యలేదు. మా సర్వే లో పాల్గొనని కేసీఆర్ కుటుంబం మాట్లాడే హక్కే లేదు. నీకు చేతకాలేదు, సంక్షేమమ్ చేయలేక పోయినరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడ్తున్నారు’’ అని ఎద్దేవా చేరశారు.

‘‘బీజేపీ బిఅరెస్ లోపాయకారి ఒప్పందం తోనే ఎన్నికల్లో బిఅరెస్ అభ్యర్థి ని పెట్టకపోవడం. మత్తులో మునిగే సంస్కృతి మీది. దుబాయ్ లో చనిపోయిన కెదర్‌కి బీఆర్ఎస్‌కు లింక్ ఉంది. స్ట్రేచర్ గురించి మాట్లాడ్తున్నారు..ప్రస్తుతం మీరు స్టెచర్ మీద ఉన్నారు. కేటీఆర్ కేసీఆర్ ము అహంకారం తగ్గలేదు ప్రజలు అర్ధం చేసుకోవాలి. కేసీఆర్ సభకు వచ్చారు..మిగిలిన రోజులు కూడా రావాలి. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న పార్టీ బిఅరెస్. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం టచ్ చేసి చూడు కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు...రెచ్చ గొట్టే మాటలు మానేయండి’’ అని సూచించారు.

Tags:    

Similar News