కర్నూల్ బస్సు ప్రమాదం : సీఎం ఆదేశంతో అప్రమత్తమైన తెలంగాణ అధికారులు
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై కదిలిన తెలంగాణ అధికారులు
By : Saleem Shaik
Update: 2025-10-24 07:14 GMT
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అప్రమత్తమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు , డీజీపీ శివధర్ రెడ్డి తో పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం తరఫున తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫోన్ నంబర్లు- 99129 19545, 94408 54433 తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్ కో సీఎండీ హరీష్ ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
బాధితులను ఆదుకోండి
గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సీఎం సూచించారు. ప్రమాదంలో మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు సీఎం తీవ్ర సంతాపం తెలిపారు.
రంగంలో దిగిన జోగులాంబ గద్వాల్ అధికారులు
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదంపై సంబంధిత అధికారులతో చర్చించి, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం తో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తోంది.
పోలీసు కంట్రోల్ రూమ్
బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కిం అధికారులతో హెల్ప్‌లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేసింది.బాధితులు ఈ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ: 9912919545
చిట్టిబాబు సెక్షన్ ఆఫీసర్:9440854433
బస్సు ప్రమాదం నేపథ్యంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా, కలెక్టర్ కార్యాలయంలో, పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచార కోసం బాధిత కుటుంబాలు కింద నంబర్‌కు సంప్రదించవచ్చు.
గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబరు. 8712661828
గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నంబరు 9502271122*
కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నంబరు 9100901599,9100901598
కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం.9100901604