వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కదం తొక్కిన ముస్లింలు
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ దారుస్సలాంలో ముస్లింలు నిరసన తెలిపారు.తమకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును తిరస్కరించండి అంటూ ముస్లింలు గళం ఎత్తారు.;
By : The Federal
Update: 2025-04-19 16:58 GMT
చలో దారుస్సలాం వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించండి (We Reject Waqf Bill)అనే నినాదంతో ఏఐఎంపీఎల్‌బీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దారుస్సలాంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చార్మినార్ నుంచి దారుస్సలాం వరకు జనం నిరసనలతో పాతనగరం మార్మోగిపోయింది.(Save Waqf, Save Constitution)
వక్ఫ్‌సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన బహిరంగసభ నిర్వహించారు.దారుల్‌సలాంలోని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయ మైదానంలో భారీ సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముస్లిం సంఘాల ప్రతినిధులు, అన్ని సంఘాల నేతలు పాల్గొన్నారు.
సభకు ముందు దారుస్సలాంలో మక్కా మసీదు ఖతీబ్ రిజ్వాన్ ఖురేషీ ఆధ్వర్యంలో మగరీబ్ నమాజ్ చేశారు.నమాజ్ అనంతరం ఏఐఎంపీఎల్‌బీ, మజ్లిస్, వివిధ ముస్లిం సంఘాల నేతలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు.వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా మజ్లిస్ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో పలు ముస్లిం సంఘాలు పాల్గొన్నాయి.