చ‌త్తీస్ గ‌డ్ లో మావోయిస్టుల‌కు భారీ ఎదురు దెబ్బ‌

103 మంది మావోయిస్టులు లొంగుబాటు

Update: 2025-10-02 15:25 GMT

చ‌త్తీస్ గ‌డ్ లో మావోయిస్టుల‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఏకంగా 103 మంది మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. వివిధ కేడ‌ర్ ల‌లో ప‌ని చేస్తున్న49 మంది మావోయిస్టుల‌పై1.6 కోట్ల రివార్డు ఉంది. బీజాపూర్ జిల్లా బ‌స్ల‌ర్ డివిజ‌న్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల స‌మ‌క్షంలో మావోలు లొంగిపోయారు. లొంగిపోయిన మావోల్లో 22మంది మ‌హిళ‌లు ఉన్నారు.చ‌త్తీస్ గ‌డ్ లో ఒకే రోజు భారీ స్థాయిలో లొంగిపోవడం ఇదే ప్ర‌థ‌మం.

మావోయిస్టుల సిద్దాంతాల‌కు నూక‌లు చెల్లాయ‌ని బీజాపూర్ ఎస్పి జితేంద‌ర్ యాద‌వ్ మీడియాతో అన్నారు.లొంగిపోయిన మావోల‌కు త‌క్ష‌ణ సాయం క్రింద రూ 50 వేల పారితోషికం అంద జేశారు. వారికి ప్ర‌భుత్వ పున‌రావాస కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌నున్న‌ట్టు ఎస్పి చెప్పారు.

Tags:    

Similar News