వరుస అగ్ని ప్రమాదాలతో పాతబస్తీ

కలకలం రేపిన పహాడీ షరీఫ్ ఘటన;

Update: 2025-06-21 13:18 GMT

హైద్రాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గత నెలలో పాతబస్తీ గుల్జార్ హౌజ్ లో అగ్ని ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయారు. అదే పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది.

పహడీ షరీఫ్ లో పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. 

Tags:    

Similar News