మేడారం జాతర తేదీలు ఖరారు

Update: 2025-07-02 05:37 GMT

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన 2026 మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది.

వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది.

28న సాయంకాలం 6గంటలకు సారలమ్మ గద్దెకు వస్తుంది.  తర్వాత గోవిందరాజు, పగిడిద్దరాజు,

29న సాయంకాలం  6 గంటలకు సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు.

30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని పూజారుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.

Tags:    

Similar News